సిటీబ్యూరో : జలమండలి పరిధిలో పనిచేస్తున్న మీటర్ రీడర్ల జీవితాలను ప్రశ్నార్థకంలో నెట్టేలా తీసుకొచ్చిన అక్రమ కమిషన్ ఆధారిత టెండర్‌ను వెంటనే రద్దు చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మీటర్రీడర్లు జలమండలి ఎదుట మెరుపు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీవో 60 ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న మీటర్ రీడర్ల సేవలను కొనసాగించాలని, కమీషన్ ఆధారిత టెండర్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు.
మిగతా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మాదిరే తమకు కూడా ప్రతి నెలా మొదటి తారీఖునే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం జలమండలి రెవెన్యూ సీజీఎం కిరణ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్‌రెడ్డి, మనోజ్, వినోద్, విక్రమ్, అంజిరెడ్డి, చంద్రశేఖర్, రాజు, శేఖర్, గిరి, శ్రీకాంత్, మధు తదితరులు పాల్గొన్నారు.