Kapil Sibal | ఇది తాయిలాల సంస్కృతి కాదా..? : ఎల్పీజీ ధర తగ్గింపుపై మోదీ సర్కార్‌ను నిలదీసిన కపిల్ సిబల్
కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరను సిలిండర్‌కు రూ. 200 చొప్పున తగ్గించిన నేపధ్యంలో కాషాయ సర్కార్ తీరుపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) విరుచుకుపడ్డారు.
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరను సిలిండర్‌కు రూ. 200 చొప్పున తగ్గించిన నేపధ్యంలో కాషాయ సర్కార్ తీరుపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) విరుచుకుపడ్డారు. ఇది తాయిలాల (రెవ్దీ) సంస్కృతి కాదా అని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీజీ..ఉజ్వల లబ్ధిదారులకు రూ. 400 ఊరట కల్పించడం తాయిలం కాదా..? ఇది పేద ప్రజల కోసమే అని నా అంచనా..వారిని గుర్తుపెట్టుకున్నందుకు మీకు ధన్యవాదాలు.
2024 దగ్గరపడుతుండటంతో వారి గురించి మీరు ఆలోచిస్తారని అనుకుంటున్నా..అదే విపక్ష పార్టీలు ఇలాంటి ఊరట కల్పిస్తే అది మాత్రం రెవ్రీ సంస్కృతి! జైహో! అని సిబల్ ట్వీట్ చేశారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన కపిల్ సిబల్ గత ఏడాది మేలో కాంగ్రెస్‌ను వీడి ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు స్వతంత్ర సభ్యుడిగా ఎన్నికయ్యారు.
కాగా, గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 200 తగ్గిస్తున్నామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు.త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండటంతోనే కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించిందని కాంగ్రెస్ సహా విపక్షాలు మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి.
Read More :
Drone Attack: రష్యా నగరంపై డ్రోన్ల దాడి.. రవాణా విమానాలు ధ్వంసం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

