జీవితంలో పెండ్లి, పిల్లలు, ఫైనాన్షియల్ సమస్యలు, కెరీర్ ఇలా ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతూనే ఉంటాం. ఆందోళన అనేది ఒత్తిడికి రియాక్షన్. ఇది కొన్ని సందర్భాల్లో మీకు ఉపయోగకరంగా, మిమ్మల్ని అప్రమత్తంగా, ఆర్గనైజ్డ్గా ఉండటానికి సాయపడుతున్నట్లుగా ఉన్నా ప్రతి విషయానికి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే మాత్రం అది క్రమంగా యాంగ్జయిటీ డిజార్డర్‌కు దారితీస్తుంది. కారణం లేకుండా భయపడితే.. అది యాంగ్జయిటీ డిజార్డర్ అవుతుంది. ఆందోళనగా ఉన్నప్పుడు హార్ట్ బీట్ పెరుగుతుంది, శ్వాస వేగవంతం అవుతుంది, అశాంతి, ఏకాగ్రత లోపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యను సకాలంలో తగ్గించుకోకపోతే తీవ్ర సమస్యగా మారే అవకాశం ఉంది. ఇందుకోసం దవాఖాన మెట్లెక్కకుండా మన ఇంట్లో ఉండే అశ్వగంధ, బ్రహ్మి, తులసి వంటి ప్రకృతి సిద్ధమైన పదార్థాలు ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి సహాయపడతాయని జేఏఐఎమ్ఎస్ అధ్యయనం పేరొంది.
బ్రహ్మి : అద్భుతమైన ఆయుర్వేద మూలిక ఇది. ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా సహాయపడుతుంది. దీనిని ఒక అడాప్టోజెనిక్ మూలికగా పరిగణిస్తారు. ఒత్తిడికి కారణం అయిన కార్టిసాల్ స్టాయులను తగ్గించి స్ట్రెస్‌ను కంట్రోల్లో ఉంచుతుంది, ఆందోళనను తగ్గిస్తుంది. ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో 4 వారాల పాటు రోజుకు రెండుసార్లు 500 ఎంజీ బ్రహ్మి ఇచ్చిన వారిలో డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి తగ్గినట్లు గుర్తించారు.
అశ్వగంధ : అశ్వగంధ వేర్ల సారాన్ని రోజువారీగా నిర్దిష్ట మోతాదులో తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. 2023లో జరిగిన ఓ అధ్యయనంలో.. 60 రోజుల పాటు 500 మిల్లీగ్రాముల అశ్వగంధ వేరు సారాన్ని అందించిన 54 మందిలో ఒత్తిడి, ఆందోళన తగ్గినట్లు గుర్తించారు. ఒత్తిడిని కంట్రోల్లో ఉంచే కార్టిసాల్‌ను తగ్గించడంలో, సెరోటోనిన్‌ను పెంచడంలో అశ్వగంధ ఘనంగా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు.
పసుపు : మనం రోజూ వంటల్లో ఉపయోగించే పసుపు ఆందోళన తగ్గించడంలో అద్భుతంగా సాయపడుతుంది. ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం ఇవ్వడానికి పసుపులో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్ కరుమిన్ సాయపడుతుంది. ఇది సెరోటోనిన్, డోపమైన్ స్థాయులపై ప్రభావం చూపి, ఒత్తిడి స్థాయులను కంట్రోల్లో ఉంచుతుంది. తీవ్రమైన కుంగుబాటు లక్షణాలను తగ్గించడానికి పసుపు నేచురల్ మెడిసిన్.
తులసి : ఒత్తిడిని తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నాడీ వ్యవస్థను శాంతపరిచే అద్భుతమైన గుణాలు ఇందులో ఉండటం విశేషం. తులసిలోని ఔషధ గుణాలు మానసిక స్పష్టతను మెరుగుపరిచి, ఏకాగ్రతను పెంచుతాయి. మన శరీరంలో ఒత్తిడికి కారణం అయిన కార్టిసాల్ లెవల్‌ను కంట్రోల్లో ఉంచడానికి తులసి సాయపడుతుంది.
ఒత్తిడిని కంట్రోల్లో ఉంచడానికి ఈ చిట్కాలతో పాటు మీ మనసు ఒకే విషయాన్ని పదేపదే ఆలోచించకుండా కంట్రోల్లో ఉంచుకోండి. రోజుకు కనీసం ఎనిమిది గంటల నిద్ర వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. కనీసం వారానికి మూడు రోజులైనా వ్యాయామంపై దృష్టి పెట్టండి. వ్యాయామాల వల్ల శరీరంలో విడుదలయ్యే కెమికల్స్ ఒత్తిడిని తగ్గించి, మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతాయి. యోగా, ప్రాణాయామం, ధ్యానం లాంటివి ఎంతో సాయపడతాయి.