వికారాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గత వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో మురుగు నిలవడం, చెత్తాచెదారం ఎక్కడిక్కడ పేరుకుపోవడంతో దోమ లు స్వైరవిహారం చేస్తుండడంతో ఒక్కసారిగా రోగాలు పెరిగిపోయా యి. దీంతో తాండూరులోని జిల్లా ఆస్పత్రితోపాటు వికారాబాద్, కొడంగల్, పరిగి ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలకు రోగులు క్యూ కడుతున్నారు. ఆస్పత్రులకు జలుబు, జ్వరం, తలనొప్పి, దగ్గు లక్షణాలతో బాధపడుతున్న వారే అధికంగా వెళ్తున్నారు. జిల్లాలో 1980 ఫీవర్ కేసు లు నమోదు కాగా ప్రాణాంతకమైన డెంగీ కేసులూ మూడు నమోదైనట్టు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యంతో జిల్లాలోని పలు పంచాయతీల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి.
పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని పలు కాలనీల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీల నిర్వహణను గాలికి వదిలేయడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో ఆ నీరు నిల్వ ఉండడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, తదితర కారణాలతో డెంగీ, డయేరియా తదితర వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. మరోవైపు సీజనల్ వ్యాధులను నివారించే వైద్యారోగ్య శాఖలో పనిచేసే ప్రోగ్రాం ఆఫీసర్లు కానీ, డిప్యూటీ డీఎంహెచ్వోలు కానీ క్షేత్రస్థాయిలో పర్యటించడంలేదనే విమర్శలున్నాయి. కొత్తగా వచ్చిన డీఎంహెచ్వో అక్కడక్కడ పర్యటిస్తూ హల్చల్ చేయడం తప్ప మిగిలిన ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అస్తవ్యస్తంగా పారిశుధ్యం..
కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలను గాలికి వదిలేయడంతో పారిశుధ్యం అటకెక్కింది. బీఆర్ఎస్ హయాంలో స్వచ్ఛ పంచాయతీలుగా పేరొంది పలు అవార్డులను పొందిన పలు పంచాయతీల్లోనూ ప్రస్తుతం ఎక్కడ చూసినా మురుగునీటి ప్రవాహం, చెత్తాచెదారం దర్శనమిస్తున్నది. రోడ్లు, మురుగునీటి కాల్వలను శుభ్రం చేయడంలేదు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యర్థాలతో రోడ్లన్నీ అపరిశుభ్రంగా మారాయి. పం చాయతీల్లో పారిశుధ్య నిర్వహణ లోపించడం తో వ్యాధులు విజృంభిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.