Watch: సమావేశంలో మేయర్ ఆగ్రహం.. అధికారిపై ఫైలు విసిరివేత
Mayor throws file at officer | అధికారుల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వారికి చీవాట్లు పెట్టారు. అలాగే ఒక ఫైల్‌ను అధికారిపైకి విసిరేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: అధికారుల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వారికి చీవాట్లు పెట్టారు. అలాగే ఒక ఫైల్‌ను అధికారిపైకి విసిరేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. నగరంలో డ్రైనేజీ క్లీనింగ్ చేపట్టాలని రెండు నెలల కిందట అధికారులను కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే (Kanpur mayor Pramila Pandey) ఆదేశించారు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఆమె స్వయంగా పరిశీలించారు. ఇంజినీర్లు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆరు జోన్ల ఇంజినీర్లతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
కాగా, డ్రైనేజీ ఆక్రమణలు తొలగించకపోవడంతో అవి పూడుకుపోయి అపరిశుభ్రంగా మారడంపై మేయర్ ప్రమీలా పాండే ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించకుండా ఏసీ గదుల్లో ఉండి ఫొటోలు తీయించడంపై మీటింగ్‌లో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఒక అధికారి ముఖంపై ఫైల్‌ను విసిరికొట్టారు. కాలువలు శుభ్రం చేయకపోతే సహించబోనని హెచ్చరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Uttar Pradesh: Kanpur Mayor Pramila Pandey throws a file at an officer during a meeting of officials held on drain cleaning and other issues in the Kanpur Municipal Corporation office. pic.twitter.com/rsrEQHBveg
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 12, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- angry
- Kanpur Mayor
- meeting
- officer
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

