కాన్పూర్: ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఓ 81 ఏండ్ల వృద్ధురాలు రాణీదేవి (81) సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాన్పూర్ జిల్లాలోని చౌబేపూర్ గ్రామానికి చెందిన ఆమె.. ఈ మేరకు మంగళవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. గ్రామంలో ఇప్పటివరకు ఎంతో మంది నాయకులు సర్పంచ్‌లుగా పనిచేసినా ఎవరూ గ్రామాన్ని పెద్దగా అభివృద్ధి చేయలేదని, అందుకే ఈసారి తాను పోటీ చేస్తున్నానని ఆమె చెప్పారు.
ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే గ్రామంలో సమూల మార్పులు తీసుకొస్తానని ఆమె చెబుతున్నారు. గ్రామంలో ప్రజలకు పంచాయతీ తరఫున అందాల్సిన అన్ని రకాల సౌకర్యాలను మెరుగుపరుస్తానని, గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఆమె హామీ ఇస్తున్నారు. తనకు అవకాశం ఇస్తే గ్రామం రూపురేఖలే మార్చి చూపిస్తానంటున్నారు.
Kanpur: An 81-year-old woman, Rani Devi, from Chaubepur has filed her nomination for upcoming Panchayat polls to ensure better facilities & development for her village
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 6, 2021
"No leader has done anything here. I will contest & bring in much-needed changes myself," she said (06.04) pic.twitter.com/WZ1JhGzdVf
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
టీకాతో బ్లడ్ క్లాటింగ్.. 30 మందిలో ఏడుగురు మృతి
భూమి వైపు దూసుకొస్తున్న మరో ఉల్క
నేడు ప్రధాని ‘పరీక్షా పే చర్చ’
ఏనుగు పిల్లను భుజాలపై మోసుకెళ్లిన ఫారెస్ట్ గార్డ్.. వీడియో వైరల్