బెంగళూర్ : అతివేగంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ జంటను ఢీకొట్టి మహిళ మృతికి బాధ్యుడైన కన్నడ నటుడు (Kannada Actor Arrest) నాగభూషణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూర్‌లో శనివారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో నాగభూషణ్ వాహనం వసంతపుర మెయిన్‌రోడ్డు ఫుట్‌పాత్‌పై నడుస్తున్న దంపతులను ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో నటుడు ఉత్తరహళ్లి నుంచి కొననకుంటె వైపు వెళుతున్నారు.
ఈ ఘటనలో మహిళ ప్రేమ (48) తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె భర్త కృష్ణ (58)కు కాళ్లు, తల, పొట్టపై బలమైన గాయాలయ్యాయి. కారు ఢీకొనడంతో గాయపడిన జంటను నాగభూషణ స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లాడని పోలీసులు తెలిపారు.
Read More :
Afghanistan | భారత్‌లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నాం.. ప్రకటించిన అఫ్ఘానిస్థాన్