సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ‘మండి’ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, సినీ నటి కంగనా రనౌత్‌కు ఎన్నికల ప్రచారంలో సోమవారం చేదు అనుభవం ఎదురైంది. లాహౌల్, స్పితి జిల్లాలో కంగనకు స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.
హిమాచల్ బీజేపీ చీఫ్ జైరామ్ ఠాకూర్, మరికొంత మంది పార్టీ నాయకులతో కలిసి కంగనా వెళ్తున్న కాన్వాయ్ కాజాకు చేరుకోగా, వందల మంది ప్రజలు నల్ల జెండాలు ఊపి తమ నిరసన వ్యక్తం చేశారు. ‘కంగనా వంగనా నహీ చలేగా’ (కంగనా మాకోసం పనిచేయనక్కర్లేదు).. అంటూ ఆమెపై స్థానికులు వ్యతిరేకతను చూపారు. దలైలామాపై గత ఏడాది ఏప్రిల్‌లో కంగనా చేసిన వ్యాఖ్యల ఫలితమే తాజా నిరసనలకు దారితీసిందని సమాచారం.