గౌహతి: నీలాచల కొండపై ఉన్న కామాఖ్యా దేవి ఆలయ(Kamakhya Temple) ద్వారాలను ఇవాళ తెరిచారు. అంబుబాచి మేళా సందర్భంగా నాలుగు రోజుల పాటు ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. అంబుబాచి మేళాను ప్రతి ఏడాది నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు. కామాఖ్య అమ్మవారి రుతుస్త్రావం సందర్భంగా ఆ సమయంలో ఆలయాన్ని మూసివేస్తారు. ఆదివారం మూసిన ద్వారాలను ఇవాళ తెరిచారు. జూన్ 22వ తేదీ నుంచి మేళా సందర్భంగా అస్సాం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. గత నాలుగు రోజుల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు కామాఖ్యా అమ్మవారిని దర్శించుకున్నారు. నిబృత్తి సందర్భంగా ఆలయ ద్వారాలను తెరిచినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తన ఎక్స్ లో పోస్టు చేశారు. భారతదేశ సౌభాగ్యం కోసం అమ్మకు ప్రార్థన చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరినీ దీవించాలని, నాగరికతను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కోరుకున్నారు. అంబుబాచి మేళ సమయంలో ఆలయం వద్ద వీఐపీ లేదా వీవీఐపీ సేవలు ఉండవు. భక్తుల సందర్శన కోసం బ్రహ్మపుత్ర నదిలో ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేశారు.
#WATCH | Kamakhya temple doors reopen after Ambubachi.#Guwahati #Assam #ambubachi2025 pic.twitter.com/CTiKoQrKbr
— GPlus (@guwahatiplus) June 26, 2025