Kalyan Banerjee: అభిషేక్ కావాలా?.. నేనా? దీదీకి కళ్యాణ్ బెనర్జీ అల్టిమేటం
Kalyan Banerjee : నేను కావాలా లేక అభిషేక్ కావాలో తేల్చుకోవాలని మమతా బెనర్జీకి అల్టిమేటం జారీ చేశారు కళ్యాణ్ బెనర్జీ. ఇప్పటికే కుదేలవుతున్న టీఎంసీకి .. కొత్తగా ఎంపీ కళ్యాబ్ బెనర్జీ మరో షాక్ ఇచ్చారు. దీదీ మేనల్లుడు అభిషేక్ అహంకారంతో ప్రవర్తిస్తున్నాడని ఆయన ఆరోపించారు.
న్యూఢిల్లీ: తృణామూల్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలియని రీతిలో ఉన్నది. పార్టీ చీఫ్ మమతా బెనర్జీకి ఆ పార్టీ సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ(Kalyan Banerjee) అల్టిమేటం జారీ చేశారు. మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కావాలా లేక తన లాంటి సీనయర్ నాయకులు కావాలో మమత తేల్చుకోవాలని ఆయన అన్నారు. నేను మమతా బెనర్జీతోనే ఉన్నాను, కానీ దీదీ.. అభిషేక్‌తో ఉందా లేక టీఎంసీతో ఉందా అన్న విషయాన్ని ఆమెనే తేల్చుకోవాలని కళ్యాణ్ బెనర్జీ అన్నారు. టీఎంసీ పార్టీలో ఇటీవల ముసలం చెలరేగిన విషయం తెలిసిందే. కొందరు రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే ఆ పార్టీని వీడారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ పార్టీ చావుదెబ్బతిన్న విషయం తెలిసిందే.
ఇక రాబోయే రోజుల్లో న్యాయపరమైన అంశాల్లో అభిషేక్ బెనర్జీ తరపున తాను వాదించబోను అని కళ్యాణ్ బెనర్జీ స్పష్టం చేశారు. ఫోర్జరీ కేసులో బెంగాల్ సీఐడీ అభిషేక్‌కు సమన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కళ్యాణ్ బెనర్జీ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ కేసులో అభిషేక్ బెనర్జీ తరపున న్యాయవాది అయాన్ భట్టాచార్య వాదించారు. జస్టిస్ కౌషిక్ చాంద్ ధర్మాసనం ఆ కేసును విచారించింది. ఈ కేసులో అభిషేక్ తన పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు.
అభిషేక్ బెనర్జీ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అభిషేక్ కేసును బెంచ్‌పై త్వరగా తీసుకొచ్చేందుకు జస్టిస్ చాంద్‌ను కోరానని, కానీ ఈలోగా మరో చిన్న లాయర్‌ను అతను మాట్లాడుకున్నాడని కళ్యాణ్ ఆరోపించారు. ప్రతి ఒక్కరూ తనకన్నా చిన్నవారే అన్న అహంకారం అభిషేక్‌కు ఉందని కళ్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు.
Kolkata, West Bengal: TMC MP Kalyan Banerjee says, “I am with the Mamata Banerjee. But Mamata Di has to decide whether Mamata Di will keep Abhishek or keep myself…Mamata Di has to decide first. Mamata Di has to first decide that she cannot move the party without Abhishek… pic.twitter.com/HIq0zDoy06
— IANS (@ians_india) June 11, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

