రాంచీ : జార్ఖండ్‌లోని గాండేయ్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సతీమణి కల్పనా సొరేన్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ వర్మపై ఆమె 27 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అవసరమైంది. ఫలితాలు వెలువడిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనకు మద్దతిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జేఎంఎం చీఫ్ శిబు సొరేన్, తన భర్త హేమంత్‌లకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రజల కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తానని తెలిపారు. ఇండియా కూటమి ఐక్యంగా ముందుకెళ్తుందన్నారు.