రాయ్‌పూర్ : ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహారాజ్‌ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాళీచరణ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ ఖజురహాలో కాళీచరణ్‌ను అరెస్టు చేసి.. రాయ్‌పూర్‌కు తరలిస్తున్నారు. రాయ్‌పూర్‌లో జరిగిన ధరమ్ సన్సద్లో గాంధీని కించపరుస్తూ కాళీచరణ్ వ్యాఖ్యానించారు. కాళీచరణ్‌పై ఐపీసీ 505(2), 294 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
గాంధీని అవమానపరుస్తూ.. హంతకుడైన నాథూరామ్ గాడ్సేను కాళీచరణ్ ప్రశంసించారు. మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ దేశాన్ని నాశనం చేశాడు.. అతన్ని చంపిన నాథూరామ్ గాడ్సేకి వందనాలు అని కాళీచరణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ధరమ్ సన్సద్ సమావేశానికి వచ్చిన ముఖ్య అతిథి మహంత్ రామ్‌సుందర్ దాస్.. కాళీచరణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ స్టేజీ దిగి వెళ్లిపోయారు.