ఆదివారం పంజ్తరని, శేశ్నాగ్ ప్రాంతాల్లో ఆగి ఉన్న యాత్రికులను అనుమతించారు. వర్షాల కారణంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మూడు రోజులపాటు యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా, అమరనాథుడిని దర్శించుకొన్న భక్తులు తిరిగి వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు.
మరోవైపు జమ్ముకశ్మీర్లో రెండు రోజులపాటు కొనసాగనున్న కైలాశ్ యాత్ర సెప్టెంబర్ 11న ప్రారంభంకానున్నట్టు అధికారులు వెల్లడించారు.