Jyoti Malhotra | గూఢచర్యం (spying) కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)కు బిగ్ షాక్ తగిలింది. పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ అయ్యింది (Instagram Account Taken Down). ఆమె ఖాతాను మెటా బ్లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్‌స్టా ఖాతా బ్లాక్ అయినప్పటికీ ఆమె యూట్యూబ్ ఛానల్ మాత్రం అందుబాటులోనే ఉంది.
పాకిస్థాన్‌కు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)ను అధికారులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొందిన జ్యోతి 2023లో పాక్‌ను సందర్శించింది. ఆమె ఎవరికీ అనుమానం రాకుండా పాక్ అధికారులకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తేలింది. ఈ కేసులో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వ్లాగర్‌తో కలిసి పని చేస్తున్నట్లు గుర్తించారు. మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మన దేశంలోని కీలక ప్రాంతాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌తో పంచుకున్నట్లు తేలింది.
అంతేకాదు ఓ పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌తో సన్నిహితంగా మెలుగుతున్నట్లు కూడా తేలింది. అతడితో ఆమె అంతర్జాతీయ ట్రిప్‌కు కూడా వెళ్లింది. ఇండోనేషియాలోని బాలికి విహారయాత్రకు వెళ్లి వచ్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. జ్యోతిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఇక దర్యాప్తులో తాను తప్పు చేసినట్లు జ్యోతి రాతపూర్వకంగా అంగీకరించినట్లు సమాచారం. జ్యోతితోపాటు మరో ఐదుగురి గుట్టును కూడా అధికారులు బయటపెట్టారు. వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతాన్ని సందర్శించినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాదు అక్కడ వీడియోలు తీసినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఆ వీడియోలను పాక్ ఏజెంట్ల (Pak Agents)తో పంచుకున్నట్లు భావిస్తున్నారు. దీనిపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడికి దాదాపు మూడు నెలల ముందు ఆమె తరచూ జమ్ము కశ్మీర్లో పర్యటించినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఒకసారి చైనాకు కూడా వెళ్లొచ్చినట్లు తేలింది.
Also Read..
Spying For Pak | పాకిస్థాన్ కోసం గూఢచర్యం.. యూపీ వ్యాపారి అరెస్ట్
Spying | పాకిస్థాన్ కోసం గూఢచర్యం.. నుహ్‌లో మరో వ్యక్తి అరెస్ట్