న్యూఢిల్లీ : పెద్ద ఎత్తున నగదు వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను కేంద్రం అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. శుక్రవారం ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
జస్టిస్ వర్మకు న్యాయపరమైన విధులను ప్రస్తుతానికి అప్పగించవద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని తీవ్రంగా విమర్శించిన ఆ రాష్ట్ర హైకోర్ట్ బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించింది.