Justice Yashwant Varma : అభిశంసనకు ముందే.. రాష్ట్రపతికి రాజీనామా పంపిన జస్టిస్ యశ్వంత్ వర్మ
Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో ఆయన జడ్జీగా ఉన్నారు. అవినీతి ఆరోపణ కేసులో ఆయనపై అభిశంసన ప్రక్రియ చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అకస్మాత్తుగా తన రాజీనామాను రాష్ట్రపతికి పంపారు.
న్యూఢిల్లీ: జస్టిస్ యశ్వంత్ వర్మ(Justice Yashwant Varma) రాజీనామా చేశారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో ఆయన జడ్జీగా ఉన్నారు. అవినీతి ఆరోపణ కేసులో ఆయనపై అభిశంసన ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. జడ్జీ హోదా నుంచి ఆయన్ను తప్పించేందకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపారు. గత ఏడాది ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి భారీ ఎత్తున నోట్ల కట్లను రికవరీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతికి రాసిన రాజీనామా లేఖలో ఆయన ఎటువంటి కారణాన్ని వెల్లడించలేదు. కానీ తక్షణమే అలహాబాద్ కోర్టు నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 9వ తేదీన ఆయన ఆ లేఖ రాశారు.
యశ్వంత్ వర్మ రాజీనామా చేయడం వల్ల.. ఆయనపై చేపట్టాల్సిన అభిశంసన ప్రక్రియ నిలిచిపోతుందని లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించినట్లు ఓ అధికారి ద్వారా తెలిసింది. రాజీనామా తర్వాత జస్టిస్ వర్మకు యధావిధిగా పెన్షన్‌తో పాటు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుతాయి. ఒకవేళ ఆయన్ను పార్లమెంట్ తొలగిస్తే, అప్పుడు ఆయనకు బెనిఫిట్స్ అందేవి కాదు. ఢిల్లీ హైకోర్టు జడ్జీగా ఉన్న సమయంలో.. 2025 మార్చి 14వ తేదీన ఆయన ఇంట్లో భారీగా నగదును సీజ్ చేశారు. ఆయన ఉంటున్న క్వార్టర్స్‌లోని స్టోర్‌రూమ్‌లో సగం కాలిన నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో జస్టిస్ వర్మతో పాటు ఆయన భార్య భూపాల్‌లో ఉన్నారు. స్టోర్‌రూమ్‌లో నగదును తాము పెట్టలేదని జడ్జీ చాలా సార్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

