న్యూఢిల్లీ : ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నోట్ల కట్టలు లభించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ తనపై చర్యలు చేపట్టాలని సిఫార్సు చేస్తూ అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదిక చట్టబద్ధతను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు.
తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు నియమించిన అంతర్గత కమిటీ చట్టబద్ధతను ఆయన సవాలు చేశారు. న్యాయబద్ధంగా విచారణ జరగలేదని, చట్టపరమైన ప్రక్రియను పాటించలేదన్నారు. ఆరోపణల నేపథ్యంలో గతంలోనే జస్టిస్ వర్మను సుప్రీంకోర్టు కొలీజియం అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది.