న్యూఢిల్లీ, నవంబర్ 13: సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్‌పర్సన్‌గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయన పేరును నామినేట్ చేశారు.
మంగళవారం ఈ మేరకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఓ నోటిఫికేషన్ జారీచేసింది. సుప్రీంకోర్టు పరిధిలోని కేసుల్లో పేదలు, బలహీన వర్గాలకు న్యాయ సాయం అందించేందుకు లీగల్ సర్వీసెస్ కమిటీని ఏర్పాటుచేశారు.