న్యూఢిల్లీ : తదుపరి భారత ప్రధాన న్యామూర్తిగా(సీజేఐ) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మంగళవారం నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. మరుసటి రోజు అంటే మే 14న సీజేఐగా జస్టిస్ గవాయ్ పదవీ బాధ్యతలు చేపడతారు. 52వ సీజేఐగా జస్టిస్ గవాయ్ నియామకాన్ని ప్రకటిస్తూ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ పేరును సీజేఐ ఖన్నా ఏప్రిల్ 16న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఆరు నెలల పాటు జస్టిస్ గవాయ్ సీజేఐగా కొనసాగనున్నారు.