న్యూఢిల్లీ : ఇటీవల దేశంలో పలుచోట్ల జరిగిన ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, దానికి ప్రధాన కారణం ఎన్నికల సంఘమేనంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 200 మందికి పైగా రిటైర్డ్ జడ్జీలు, అధికారులు, మాజీ ఆర్మీ అధికారులు, దౌత్యవేత్తల బృందం తీవ్రంగా విమర్శించింది.
ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆ గ్రూప్ ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది.