న్యూఢిల్లీ: ఉన్న ఉద్యోగాలను కృత్రిమ మేధ (ఏఐ) తొలగించదని, అది కొత్త అవకాశాలను సృష్టిస్తుందని యువతకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ ‘ఏఐ మానవ పనిని తొలగించదు. కానీ దానిని మారుస్తుంది. ప్రభుత్వం నైపుణ్యం, పునరుజ్జీవన కార్యక్రమాలపై నిధులను కురిపిస్తున్నది. యువ నిపుణులు మనుగడ సాధించడానికి మాత్రమే కాకుండా ఏఐ ఆధారిత ప్రపంచంలో నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని నిర్ధారిస్తుంది’అని పేర్కొన్నారు. ఏఐ తమకు అపకారం చేస్తుందని భయపడటానికి బదులుగా ఆ సమస్యను పరిష్కరించానికి యువ త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.