న్యూఢిల్లీ: తుర్కియేలోని ఇనోను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) నిలిపివేసినట్లు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) ప్రకటించింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించింది.
ఇదిలా ఉండగా, తుర్కియేను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్‌మీడియాలో ఉద్యమం నడుస్తున్నది. తుర్కియేతోపాటు పాక్‌కు మద్దతు పలికిన అజర్‌బైజాన్‌కు భారతీయుల ట్రావెల్ బుకింగ్స్ 60 శాతం తగ్గినట్టు మేక్మైట్రిప్ వెల్లడించింది. అంతేగాక పర్యాటకుల బుకింగ్స్ రద్దు చేసుకోవటం 250శాతానికి చేరుకుందని తెలిపింది.