శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 04, 2020 , 21:56:13

రైతులపై కేసులు ఎత్తివేయాలని జేజేపీ డిమాండ్‌

రైతులపై కేసులు ఎత్తివేయాలని జేజేపీ డిమాండ్‌

చండీగఢ్‌: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న హర్యానా రైతులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని బీజేపీ కూటమికి చెందిన జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) డిమాండ్‌ చేసింది. ఆ పార్టీకి చెందిన ప్రతినిధి బృందం ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ విజ్‌ను శుక్రవారం కలిసింది. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలపై ఆయనతో చర్చించింది. హర్యానా రైతులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో బీజేపీకి తమ మద్దతుపై పునరాలోచిస్తామని పరోక్షంగా హెచ్చరించింది.