Jitan Ram Manjhi : బిహార్లో ఇటీవల వరుసగా కుప్పకూలుతున్న వంతెనలపై కేంద్ర మంత్రి జితన్ రాం మాంఝీ కీలక వ్యాఖ్యలు చేశారు. వరుసగా వంతెనలు కూలుతున్న ఘటనలపై ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వంతెనల నిర్మాణంలో ఏమైనా అవకతవకలు జరిగితే ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టి పరిస్ధితని చక్కదిద్దుతుందని చెప్పారు.
వరుస ఘటనల నేపధ్యంలో బిహార్లోని వంతెనలను ప్రభుత్వం ముందస్తుగా పరిశీలిస్తోందని వెల్లడించారు. మరమ్మత్తులు సహా బ్రిడ్జిల నిర్మాణంలో లోపాలు తలెత్తితే వాటిని సరిదిద్దేందుకు చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి చెప్పారు. కాగా, బీహార్లో ఇటీవల వంతెనలు పేకమేడల్లాగా కూలుతున్నాయి. గత కొద్దిరోజుల్లో ఏకంగా 12 వంతెనలు కుప్పకూలాయి. వంతెనలు కూలుతుండటంతో అప్రమత్తమైన బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
15 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు నిర్మాణంలో ఉన్న వంతెనలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. మరోవైపు నిర్మాణ వ్యయాన్ని దోషులుగా గుర్తించిన కాంట్రాక్టర్లపై విధించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వరుసగా వంతెనలు కూలుతున్న ఘటనలపై ఎన్డీయే సర్కార్ లక్ష్యంగా విపక్ష కూటమి విమర్శలు గుప్పిస్తోంది. మోదీ సర్కార్ హయాంలో విమానాశ్రాయాల్లో పైకప్పులు విరగడం, వంతెనలు కుప్పకూలడం మినహా అభివృద్ధి మచ్చుకైనా కనిపించదని విపక్ష నేతలు దుయ్యబడుతున్నారు.
Read More :
Watch: మహిళా కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తున్న స్కూటీని ఢీకొట్టిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?