న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఈడీ పంపిన సమన్లపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ఈడీని ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు.
ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరుపుతుంది. ఈ నెల 23న హాజరుకావాలని ఈడీ సొరేన్‌ను ఆదేశించింది. తనకు జారీ చేసిన సమన్లను ఉపసంహరించాలని, లేదంటే తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని గత నెలలో ఆయన ఈడీని హెచ్చరించారు.