Jharkhand Cabinet | జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జేఎమ్ఎమ్ నేత హేమంత్ సొరేన్ (Hemant Soren) గతవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన మంత్రివర్గ (Jharkhand Cabinet) విస్తరణ చేపట్టారు. ఇందులో భాగంగా 11 మందికి చోటు కల్పించారు. వారంతా మంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.
Ranchi, Jharkhand | JMM MLA Stephen Marandi took oath as Protem Speaker of the Legislative Assembly pic.twitter.com/n45Ih1sQ4V
— ANI (@ANI) December 5, 2024
జేఎమ్ఎమ్ ఎమ్మెల్యేలు దీపక్ బిరువా, చమ్ర లిండా, రాందాస్ సోరెన్, హఫీజుల్ హసన్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాధా కృష్ణ కిషోర్, ఇర్ఫాన్ అన్సారీ, ఆర్జేడీ ఎమ్మెల్యే సంజయ్ ప్రసాద్ యాదవ్ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్గా జేఎమ్ఎమ్ ఎమ్మెల్యే స్టీఫెన్ మరాండీ ప్రమాణం చేశారు. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులచే గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయించారు.
Ranchi, Jharkhand | Congress MLA Radha Krishana Kishore, JMM MLA Deepak Birua, JMM MLA Chamra Linda and RJD MLA Sanjay Prasad Yadav take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/BXU7ozCGcx
— ANI (@ANI) December 5, 2024
కాగా, ఇటీవలే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 81 నియోజకవర్గాలకు గానూ జేఎంఎం కూటమికి 56 స్థానాలు, ఎన్డీయే కూటమికి 24 స్థానాలు లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా (Jharkhand CM) జేఎంఎం చీఫ్ హేమంత్ సోరేన్ (Hemant Soren) గత నెల 28న ప్రమాణ స్వీకారం చేశారు.
Ranchi, Jharkhand | JMM MLA Ramdas Soren, Congress MLA Irfan Ansari, JMM MLA Hafizul Hasan and Congress MLA Dipika Pandey Singh take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/46PTFLlabh
— ANI (@ANI) December 5, 2024
Also Read..
Sanjay Raut | షిండే శకం ముగిసింది.. ఆయన మళ్లీ సీఎం కాలేరు : సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
Air Pollution | ఢిల్లీలో మెరుగుపడిన గాలి నాణ్యత.. 165గా ఏక్యూఐ లెవల్స్
Devendra Fadnvais | నేడే సీఎంగా ప్రమాణం.. సిద్ధి వినాయక ఆలయంలో ఫడ్నవీస్ ప్రత్యేక పూజలు