Devendra Fadnvais | మహారాష్ట్రలో పది రోజుల ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా (Maharashtra CM) బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnvais) పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని (Shree Siddhivinayak Temple) ఫడ్నవీస్ సందర్శించారు. గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఫడ్నవీస్‌కు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ఫడ్నవీస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం పండితులు శేష వస్త్రంతో ఆయన్ని సత్కరించారు. స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
#WATCH | Maharashtra CM-designate Devendra Fadnvais offered prayers at Shree Siddhivinayak Temple today, ahead of his swearing-in ceremony.
(Video: Shree Siddhivinayak Temple Trust) pic.twitter.com/cPYbcKl4tp
— ANI (@ANI) December 5, 2024
కాగా, బుధవారం విధాన్ భవన్లో జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఫడ్నవీస్‌ను బీజేపీ ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కానున్నారని, మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడుతున్నట్టు బీజేపీ పరిశీలకులు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, విజయ్ రూపాని ప్రకటించారు. దీంతో ఫడ్నవీస్, ఏక్నాథ్ సిండే, అజిత్ పవార్ నేతృత్వంలోని మహాయుతి ప్రతినిధి బృందం బుధవారం సాయంత్రం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరింది. గురువారం సాయంత్రం 5.30 గంటలకు దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడోసారి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
ఉప ముఖ్యమంత్రులుగా షిండే, పవార్
ఫడ్నవీస్‌తో పాటు ఉప ముఖ్యమంత్రులుగా శివసేన నేత, మాజీ సీఎం ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు మొదట షిండే మొండికేశారు. ఆయనను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా బీజేపీ అధిష్ఠానం, ఫడ్నవీస్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆయన స్పందించలేదు. చివరకు బుధవారం సాయంత్రం అంగీకరించిన షిండే.. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించారు.
Also Read..
Virat Kohli | కోహ్లీ ఫిట్నెస్ సీక్రెట్ బయటపెట్టిన అనుష్క.. ఆ మూడింటికే అధిక ప్రాధాన్యం
Naga Chaitanya – Shobitha | శోభిత మెడలో తాళి కట్టిన చైతూ.. వీడియో
Samantha | ఈ అమ్మాయిలా పోరాడండి.. చైతూ రెండో పెళ్లి వేళ సమంత ఆసక్తికర పోస్ట్