Virat Kohli | కోహ్లీ ఫిట్నెస్ సీక్రెట్ బయటపెట్టిన అనుష్క.. ఆ మూడింటికే అధిక ప్రాధాన్యం
Virat Kohli | స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫిట్నెస్కి అధిక ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే.
Virat Kohli | స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫిట్నెస్కి అధిక ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచంలోని ఫిట్టెస్ట్ క్రికెటర్(Fittest Cricketer) ఎవరు? అని అడిగితే.. కోహ్లీ అని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నిరంతరం కష్టపడుతూ తన శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటాడు. ఆటతో పాటు ఫిట్నెస్తో విరాట్ కోట్లాది మంది అభిమానుల మనసు గెలిచాడు. ఫిట్నెస్లో భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ విరాట్ను స్ఫూర్తిగా తీసుకుంటారు. వ్యాయామం, డైట్కు అంతలా ప్రాధాన్యమిస్తాడు ఈ స్టార్ బ్యాట్స్మెన్.
అయితే, కోహ్లీ ఫిట్నెస్ వెనుక ఉన్న రహస్యాన్ని (Kohli Fitness Secret) ఆయన సతీమణి, స్టార్ నటి అనుష్క శర్మ (Anushka Sharma) తాజాగా బయటపెట్టారు. కోహ్లీ మూడింటికే అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకొచ్చారు. ఫిట్నెస్, ఆహారం విషయంలో క్రమశిక్షణతో ఉంటారని తెలిపారు. రోజూ ఉదయం లేవగానే కార్డియో వర్కవుట్స్ చేస్తారని వెల్లడించారు. తనతో క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేస్తారని అనుష్క చెప్పుకొచ్చారు. ఇక ఆహారం విషయానికి వస్తే.. జంక్ ఫుడ్ అస్సలు తినరని, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉంటారని స్పష్టం చేశారు. కోహ్లీ దాదాపు 10 ఏళ్లుగా బటర్ చికెన్ తినలేదని అనుష్క చెప్పుకొచ్చారు. ఇక కోహ్లీ నిద్రకు కూడా తగిన ప్రాధానత్య ఇస్తారని తెలిపారు. నిద్ర విషయంలో అస్సలు రాజీపడరని చెప్పారు. దాదాపు ఎనిమిది గంటలపాటు ప్రశాంతంగా నిద్రపోతారని వివరించారు. మంచి నిద్రతో తగిన విశ్రాంతి పొందుతాడని అనుష్క తెలిపారు.
Anushka Sharma On Kohli’s fitness secret pic.twitter.com/uuikcqRYWB
— Noor (@HeyNoorr) December 4, 2024
Also Read..
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీపై పీసీబీ డిమాండ్లు..! పాక్కు ధీటైన జవాబిచ్చిన బీసీసీఐ..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

