Jewellery stolen | బీహార్ (Bihar)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే దొంగల ముఠా రెచ్చిపోయింది. జువెల్లరీ షోరూమ్ (Jewellery Showroom)లోకి ప్రవేశించి రూ.కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన అరానిలోని తనిష్క్ షోరూమ్ (Tanishq showroom)లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం 10:30 గంటలకు దుకాణం తెరిచారు. కొందరు కస్టమర్లు కూడా వచ్చారు. అదే సమయంలో ఎనిమిది నుంచి తొమ్మిది మంది ముసుగులు, హెల్మెట్లతో ముఖాలను కప్పుకుని షాప్‌లోకి ప్రవేశించారు. సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. షోరూమ్‌లోని సిబ్బంది, కస్టమర్లను తుపాకీతో బెదిరించారు. అనంతరం అక్కడున్న బంగారాన్నంతా తమ సంచుల్లో నింపుకుని ఉడాయించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు షాప్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
చోరీకి గురైన బంగారం విలువ రూ.25 కోట్లు ఉంటుందని షోరూమ్ మేనేజర్ కుమార్ మృత్యుంజయ్ తెలిపారు. బంగారు ఆభరణాలతోపాటు కొంత నగదును కూడా దొంగల ముఠా తీసుకెళ్లిపోయినట్లు చెప్పారు. అయితే, ఎంత మొత్తం సొమ్ము పోయిందన్నది ఆయన వెల్లడించలేదు. చోరీ సమయంలో దొంగల ముఠాకు తెలియకుండా పోలీసులకు ఫోన్ చేసినట్లు సిబ్బంది ఒకరు తెలిపారు. దాదాపు 25 నుంచి 30 కాల్స్ చేసినట్లు చెప్పారు. షోరూమ్‌కు 600 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ వారు సమయానికి రాలేదని ఆరోపించారు. ఫలితంగా దొంగల ముఠా ఆభరణాలతో అక్కడినుంచి పారిపోయినట్లు పేర్కొన్నారు.
A group of robbers were caught on camera holding the staff and customers at gunpoint and robbing jewellery worth Rs 25 crores from a #Tanishq showroom in #Bihar‘s #Arrah. The robbers were later involved in an encounter with the police, which left two criminals injured.
The… pic.twitter.com/oZHWjdT0Zf
— Hate Detector 🔍 (@HateDetectors) March 10, 2025
Also Read..
Twitter | ప్రపంచ వ్యాప్తంగా నిలిచిన ఎక్స్ సేవలు.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న యూజర్లు
MP Appala Naidu: అమ్మాయి పుడితే 50 వేలు.. అబ్బాయైతే ఆవు.. ఆఫర్‌ను సమర్థించుకున్న టీడీపీ ఎంపీ
Political war | ‘మీది అనాగరికత.. మీది దురహంకారం..’ హిందీ భాషపై కేంద్రం, తమిళనాడు వర్డ్స్ వార్