Twitter | అమెరికన్ టైకూన్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ( Elon Musk) ఆధీనంలోని ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ (ఎక్స్) ఇటీవలే మాటిమాటికీ సతాయిస్తోంది. ఏదో ఒక సమస్యతో యూజర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇటీవలే ఎక్స్ సేవల్లో అంతరాయం ఏర్పడటం.. లాగిన్ కాకపోవడం, ట్వీట్స్ మాయం కావడం వంటి సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఎక్స్‌లో ఇలాంటి సమస్యే తలెత్తింది.
సోమవారం మధ్యాహ్నం ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్ సేవలు నిలిచిపోయాయి. సైట్ ఓపెన్ కావడం లేదు. లాగిన్ అయినా యాక్సిస్ చేయలేక యూజర్లు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వరుసగా పోస్టులు పెడుతున్నారు. దాదాపు అరగంట నుంచి ఎక్స్ సేవలు స్తంభించిపోయినట్లు పేర్కొంటున్నారు. ఎక్స్ సైట్‌ను ఓపెన్ చేయగా.. స్క్రీన్‌పై ‘సమ్‌థింగ్ వెంట్ రాంగ్.. ప్లీజ్ ట్రై అగెయిన్’ (something went wrong) అన్న సందేశం వస్తున్నట్లు తెలిపారు.
డౌన్‌డిటెక్టర్ నివేదిక ప్రకారం.. భారత్‌లో 2 వేల మంది, అమెరికాలో 18,000, యూకేలో 10,000 మంది ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఎక్స్ అంతరాయానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. చాలా మంది వినియోగదారులు సర్వర్ డౌన్ అయినట్లు ఫిర్యాదు చేశారు. ఈ అంతరాయం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఒకింత గందరగోళానికి గురయ్యారు.
Also Read..
Political war | ‘మీది అనాగరికత.. మీది దురహంకారం..’ హిందీ భాషపై కేంద్రం, తమిళనాడు వర్డ్స్ వార్
MP Appala Naidu: అమ్మాయి పుడితే 50 వేలు.. అబ్బాయైతే ఆవు.. ఆఫర్‌ను సమర్థించుకున్న టీడీపీ ఎంపీ
Gulmarg fashion show | గుల్మార్గ్ ఫ్యాషన్ షోపై వివాదం.. జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో రచ్చ