న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 : జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలను విరమించుకున్నట్టు తెలిపింది. వాస్తవానికి గురువారమే ఫైనల్ కీని విడుదల చేసినప్పటికీ, గంటలోపే దానిని ఎన్టీఏ ఉపసంహరించుకుంది. దానికి కారణాలు తెలుపకపోవడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తుది కీని మళ్లీ విడుదల చేసిన ఎన్టీఏ.. ఫలితాలను శనివారంలోగా ప్రకటిస్తామని వెల్లడించింది. రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలను ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఎన్టీఏ నిర్వహించింది.