JEE Advanced | జేఈఈ టాపర్స్ వీళ్లే!
JEE Advanced | దేశం మొత్తం ఎదురు చూస్తున్న జేఈఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసిన ఈ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఢిల్లీ ఐఐటీకి చెందిన మృదుల్ అగర్వాల్

న్యూఢిల్లీ: దేశం మొత్తం ఎదురు చూస్తున్న జేఈఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసిన ఈ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఢిల్లీ ఐఐటీకి చెందిన మృదుల్ అగర్వాల్ తొలి స్థానంలో నిలిచారు. ఓబీసీ-ఎన్సీఎల్ విభాగంలో ప్రియాంశు యాదవ్, జనరల్ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రామస్వామి సంతోష్ రెడ్డి, ఎస్సీ విభాగంలో నందిగామ నిఖిల్, ఎస్టీ కేటగిరీలో బిజిలి ప్రచోతన్ వర్మ, జనరల్ పీడబ్ల్యూడీ విభాగంలో అర్ణవ్ జైదీప్ కల్గుట్కర్, జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ కేటగిరీలో యువరాజ్ సింగ్, ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడీ విభాగంలో గొర్లె కృష్ణ చైతన్య, ఎస్సీ పీడబ్ల్యూడీలో రాజ్‌కుమార్, ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీలో రవి శంకర్ మీనా తొలి స్థానాల్లో నిలిచారు.
బాలికల విభాగంలో ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన కావ్య చోప్రా ప్రథమ ర్యాంకు సాధించారు. హైదరాబాద్‌కు చెందిన లోకేశ్ రెడ్డి ఐదో ర్యాంకులో నిలిచారు. గుంటూరుకు చెందిన రుషికేష్ రెడ్డికి పదో ర్యాంకు, విజయవాడకు చెందిన దివాకర్ సాయి 11వ ర్యాంకులో నిలిచారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు మొత్తం 1,51,193 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,41,699 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో 41,862 మంది అర్హత సాధించారు.
వీరిలో 35,410 మంది బాలురు, 6,452 మంది బాలికలు ఉన్నారు. ఈ ర్యాంకుల ఆధారంగా 23 ఐఐటీలు సహా 114 విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విద్యార్థుల కోసం మొత్తం 50 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. రేపు అంటే శనివారం నుంచి విద్యాసంస్థల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈనెల 25 వరకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 27న సీట్ల కేటాయింపు జరగనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

