JEE Advanced : విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేఈఈ (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్) అడ్వాన్సుడ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం రాత్రి 11.00 గంటల తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయి. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన శుభం కుమార్ ఈ ఏడాది టాపర్గా నిలిచాడు.
అతడు 360 మార్కులకుగాను 330 మార్కులు సాధించాడు. ఆ తర్వాత 329 మార్కులతో కబీర్ చిల్లార్ రెండో స్థానంలో, 319 మార్కులతో జతిన్ చాహర్ మూడో స్థానంలో నిలిచారు. అమ్మాయిల్లో ఆరోహి దేశ్పాండే టాపర్గా నిలిచారు. ఆమె 280 మార్కులు సాధించారు. ఈ ఏడాది జేఈఈలో పేపర్ 1, పేపర్ 2 పరీక్షలకు మొత్తం 1,79,694 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 56,880 మంది అర్హత సాధించారు. ఇందులో 10,107 మంది మహిళా విద్యార్థులు ఉన్నారు.
అభ్యర్థులు ఫలితాల్ని jeeadv.ac.in లో లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు. అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఎంటర్ చేసి స్కోర్ బోర్డుకు సంబంధించిన పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ ద్వారా దేశంలోనే ఉన్నత విద్యాసంస్థలైన ఐఐటీలలో ప్రవేశం లభిస్తుంది.