న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్డ్ ఆశావహులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2024 నవంబర్ 5-18 మధ్య తమ కోర్సులను వదులుకున్న ఆశావహులు జేఈఈ-అడ్వాన్స్డ్ కోసం నమోదు చేసుకునేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించింది. ఆశావహులకు ఇచ్చిన అవకాశాలను మూడు నుంచి రెండుకు తగ్గించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది.
జేఈఈ-అడ్వాన్స్డ్ రాసేందుకు 2023, 2024, 2025 విద్యా సంవత్సరాలలో 12వ తరగతి పరీక్షకు హాజరైన వారు అర్హులని పేర్కొంటూ 2024 నవంబర్ 5న జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) ఓ ప్రకటనను జారీచేసిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ నిర్ణయంలోని మంచిచెడ్డల గురించి తాము లోతుగా వెళ్లదలచుకోలేదని తెలిపింది.