హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూల్ విడుదలైంది. జేఈఈ మెయిన్ తుది ఫలితాలు 2025 ఏప్రిల్ 23న లేదా అంతకుముందే విడుదలవుతాయని ఐఐటీ కాన్పూర్ పేర్కొన్నది.
మెయిన్ ర్యాంకర్లు ఏప్రిల్ 23 నుంచి మే 2వ తేదీ వరకు జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. మే 5 వరకు ఫీజు చెల్లించి, మే 11 నుంచి 18 వరకు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నది.