న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్కు ప్రధాన మంత్రి పదవి ఇస్తామని ‘ఇండియా కూటమి నేతలు ఆఫర్ చేశారని జేడీయూ నేత కేసీ త్యాగి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఈ ఆఫర్ను జేడీయూ తిరస్కరించిందని తెలిపారు.
రానున్న ఐదేండ్లూ తాము ఎన్డీయేతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాని పదవికి మోదీని బలపరుస్తూ నితీశ్ ప్రసంగించడంతో ఈ పుకార్లకు తెర పడిందని కేసీ త్యాగి అన్నారు.