Nitish Kumar | కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి (INDIA bloc) నుంచి జేడీ(యూ) చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar)కు ప్రధాని ఆఫర్ (offered PM post) వచ్చినట్లు ఆ పార్టీ నేత కేసీ త్యాగి తెలిపారు. అయితే, ‘ఇండియా’ కూటమి నేతల ఆఫర్‌ను నితీశ్ తిరస్కరించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆజ్ తక్/ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి నుంచి ప్రధాని ఆఫర్ వచ్చింది. అయితే ఆ ఆఫర్‌ను ఆయన తిరస్కరించారు. ప్రస్తుతం మేం ఎన్డీయేలో ఉన్నాము. ఇప్పుడు వెనుదిరిగి చూసే ప్రశ్నే లేదు’ అని జేడీయూ నేత కేసీ త్యాగి (KC Tyagi) తెలిపారు.
లోక్‌సభ 2024 ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 272 సీట్లను దాటలేకపోయింది. మంగళవారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే వచ్చాయి. మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ 292 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో జేడీయూ, టీడీపీ సహా భాగస్వామ్య పార్టీల తోడ్పాటు అనివార్యమైంది. అదే సమయంలో ఎన్నికల్లో ఎన్డీయేకి గట్టి పోటీ ఇచ్చిన ఇండియా కూటమి 234 స్థానాల్లో గెలుపొందింది. దీంతో కాంగ్రెస్ సైతం మిత్రపక్ష పార్టీల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఎన్డీయేకి మిత్రపక్షాలుగా ఉన్న జేడీ(యూ), టీడీపీలతో కలిసి సంఖ్యా బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే జేడీయూ చీఫ్‌కు ప్రధాని పదవి ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
Also Read..
Sheikh Hasina | రేపే మోదీ ప్రమాణ స్వీకారం.. ఢిల్లీ చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని హసీనా
Dhanyawaad Yatra | గెలుపు బావుటా.. యూపీలో ధన్యవాద్ యాత్రకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ
Ramoji Rao | రామోజీ మృతితో మీడియా, వినోద రంగం ఓ టైటాన్‌ను కోల్పోయింది : రాష్ట్రపతి ముర్ము