HD Kumaraswamy : కేంద్రంలో సుస్ధిర ప్రభుత్వ ఏర్పాటు కోసం తాము ప్రధాని మోదీ వెంట నడుస్తామని, ఎన్డీయేతోనే ప్రయాణం చేస్తామని జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. ఎన్డీయే ఎంపీల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన కుమారస్వామి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ దేశ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతారని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ భేషరతుగా నరేంద్ర మోదీని తమ నేతగా ఎంచుకున్నాయని చెప్పారు.
కాగా, ఎన్డీయే ఎంపీల సమావేశంలో నరేంద్ర మోదీని ఎన్డీయేపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోదీ నాయకత్వాన్ని రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించగా అమిత్ షా, నితిన్ గడ్కరీ, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, పవన్ కళ్యాణ్ సహా పలువురు ఎన్డీయే పక్ష నేతలు బలపరిచారు.
Read More :