జాల్నా, సెప్టెంబర్ 24 : మరాఠాలకు ఓబీసీల కింద రిజర్వేషన్లు కోరుతూ మరాఠా కోటాఉద్యమ నేత మనోజ్ జరాంగే చేస్తున్న ఆమరణ దీక్ష మంగళవారానికి 8వ రోజుకు చేరుకుంది. జాల్నాలోని అంతర్వాలి సారథి గ్రామం లో ఈ నెల 17 నుంచి చేస్తున్న దీక్షతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినా ద్రవ పదార్థాలు కానీ, వైద్య సహాయం కానీ తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. ఇలా ఆయన దీక్ష చేపట్టడం ఏడాది కాలంలో ఆరోసారి. ఇలావుండగా మరాఠాల ఓబీసీ రిజర్వేషన్ల డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ సమీపంలోని వాడిగోద్రి గ్రామంలో ఓబీసీ నేతలు లక్ష్మణ్ హాకే, నవనాథ్ వాఘ్మేర్లు కూడా దీక్ష చేపట్టారు.