న్యూఢిల్లీ: వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor).. జన్ సూరజ్ ఎన్నికల పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడి పేరును ఇవాళ ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. బీజేపీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్ను.. జన్ సూరజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించారు. ఉదయ్ సింగ్ను పప్పూ సింగ్ అని కూడా పిలుస్తుంటారు. పూర్నియా లోక్సభ సీటు నుంచి గతంలో ఉదయ్ సింగ్ రెండు సార్లు గెలిచారు. జన సూరజ్ కమిటీలో ఉన్న 150 మంది సభ్యులు ఏకగ్రీవంగా పప్పు సింగ్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. పాట్నాలోని పప్పు సింగ్ ఇంట్లోనే ప్రశాంత్ కిషోర్ ఉంటున్నారు. జన్ సూరజ్ పాదయాత్ర సమయంలో ఇద్దరి మధ్య సఖ్యత పెరిగింది.