Jammu Kashmir | న్యూఢిల్లీ, నవంబర్ 11: ఉగ్రదాడులతో జమ్ము రీజియన్ అట్టుడుకుతున్నది. మొన్నటివరకు రాజౌరీ, పూంచ్ జిల్లాలకు పరిమితమైన ఉగ్రదాడులు, 2024లో జమ్ములోని మరో ఆరు జిల్లాలకు విస్తరించాయని భద్రతా అధికారులు వెల్లడించారు.
సైన్యం కాల్పుల్లో 13 మంది ఉగ్రవాదులు హతం కాగా, ముష్కరుల దాడుల్లో 18 మంది భద్రతా సిబ్బంది వీరమరణం పొందారని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రదాడుల్లో 14 మంది పౌరులు సహా మొత్తం 44 మంది చనిపోయారని, ఇందులో ఏడుగురు శివ్ఖేర్ ఆలయ భక్తులు కూడా ఉన్నారని చెప్పారు.