శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు కద్దేర్లోని బేహిబాగ్ ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది కలిసి ఉమ్మడిగా నిర్బంధ తనిఖీలు చేపట్టారు.
ఆ సమయంలో వారిపై కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో వీరు ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ముజాహిదీన్ టాప్ కమాండర్ ఫారూక్ అహ్మద్ భట్ అలియాస్ నలి సహా ఐదుగురు మరణించారు. ఫారూక్ పలు ఉగ్రవాద నేరాలతో సంబంధాలున్నాయని అధికారులు తెలిపారు.