Jammu And Kashmir | జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. తీవ్రవాది హతం.. ఏకే రైఫిల్ స్వాధీనం
Jammu And Kashmir : జమ్మూ కాశ్మీర్లో శుక్రవారం ఎన్కౌంటర్ జరిగింది. బుద్గాం జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది.
Jammu And Kashmir : జమ్మూ కాశ్మీర్లో శుక్రవారం ఎన్కౌంటర్ జరిగింది. బుద్గాం జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీని ప్రకారం.. ఆపరేషన్ అష్దర్ పేరుతో జమ్మూ కాశ్మీర్లో తాజా ఆపరేషన్ ప్రారంభమైంది.
జమ్మూ కాశ్మీర్లోని, బుద్గాం జిల్లా, అష్దర్ గాలి ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో అనుమానాస్పద ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కలిసి సంయుక్తంగా శుక్రవారం సోదాలు ప్రారంభించారు. ఆపరేషన్ అష్దర్ పేరుతో తనిఖీ, భద్రతా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు.
OP ASHDAR, Budgam
Based on specific intelligence input, a Joint Search Operation was launched by #IndianArmy, @JmuKmrPolice and @crpf_srinagar in general area Ashdar Gali, Budgam.
Vigilant troops observed suspicious activity and upon being challenged, terrorists opened fire,…
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) September 4, 2026
దీంతో భారత భద్రతా బలగాలు కూడా వారిపై ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వద్ద నుంచి ఏకే రైఫిల్, కొన్ని ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఉగ్రవాదుల కోసం ఇంకా గాలింపు కొనసాగుతోందని సైన్యం వివరించింది. ఉన్నతాధికారులు పరిస్తితిని సమీక్షిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

