శ్రీనగర్ : జమ్ము-కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన ఆరోపణలు చేశారు. తమ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన జమ్ము ఎమ్మెల్యేను కొనేందుకు బీజేపీ రూ.30 కోట్లు ఆఫర్ చేసిందన్నారు. అలాగే మంత్రి పదవి ఇస్తామని, కేంద్రపాలిత ప్రాంతానికి తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని ప్రలోభపెట్టారంటూ ఆరోపించారు.
సుప్రీంకోర్టు న్యా యవాది ఒకరు తమ ఎమ్మెల్యేను కలిసి ఈ ఆఫర్ చేశారని.. ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యేనే తనకు చెప్పారంటూ ఒమర్ వెల్లడించాడు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎప్పటికీ తన సిద్ధాంతాన్ని మార్చుకోదన్నారు. తమ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయేవారు కాదని తెలిపారు. అయితే ఒమర్వి నిరాధార ఆరోపణలని బీజేపీ తెలిపింది.