శ్రీనగర్, జూన్ 20: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు ప్రారంభమయ్యాయని, యూటీ నుంచి రాష్ట్ర హోదాకు మారే సమయం అతి దగ్గరలోనే ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మూడోసారి ప్రధాని అయిన తర్వాత తొలిసారిగా కశ్మీర్ లోయను సందర్శించిన మోదీ గురువారం శ్రీనగర్లో రూ. 1,500 కోట్లతో చేపట్టే 84 అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
ఇటీవలి ఉగ్రవాద ఘటనలను ఆయన ప్రస్తావిస్తూ ఉగ్రవాదులకు తగిన రీతిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ నమోదు కావడానికి కృషి చేసిన ప్రజలను ఆయన ప్రశంసించారు.