న్యూఢిల్లీ : లోక్సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం అప్రజాస్వామికం కాదని, దీనివల్ల సమాఖ్య వ్యవస్థకు ఎటువంటి హాని జరగదని కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘం సభ్యుల ప్రశ్నలకు ఈ మంత్రిత్వ శాఖలోని లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ స్పందించింది.