కాళేశ్వరానికి మేం రూపాయి ఇవ్వలేదు.. ఖర్చంతా తెలంగాణ రాష్ట్రానిదే: కేంద్రం
Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) పై ఇప్పటి వరకు రూ.80వేలకోట్లకుపైగా వ్యయం చేసినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ (union jal shakti ministry) బుధవారం లోక్‌సభలో

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) పై ఇప్పటి వరకు రూ.80వేలకోట్లకుపైగా వ్యయం చేసినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ (union jal shakti ministry) బుధవారం లోక్‌సభలో వెల్లడించింది. ప్రాజెక్టు కోసం రూ.86వేల కోట్ల రుణాన్ని ఆర్థిక సంస్థలు మంజూరు చేశాయని, దాంట్లో ఇప్పటి వరకు రూ.56వేల కోట్లు విడుదల చేయగా.. 83శాతం పనులు పూర్తయ్యాయని జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై స్పష్టత కోరుతూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
తెలంగాణ సొంత ఖర్చులతో ప్రాజెక్టు నిర్మాణం
జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ అండ్ మల్టీపర్పస్ ప్రాజక్టుల సలహా సమితి 2018 జూన్‌లో అంగీకారం తెలిపినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సొంత ఖర్చులతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం.. ప్రాజెక్టు నిర్మాణానికి ఈ-ప్రొక్యూర్మెంట్ వేదికల ద్వారా లంప్సమ్ కాంట్రాక్టు సిస్టం ఆధారంగా టెండర్లు పిలిచారని వివరించారు.
అక్టోబర్ 31 నాటికి కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణం 83.7 శాతం పూర్తయ్యిందని, దీని కింద 18,25,700 ఎకరాల ఆయకట్టు ప్రాంతానికి నీరు అందించాలని ప్రతిపాదించి… అదనంగా 18,82,970 ఎకరాల భూమిని స్థిరీకరించాలని ఉద్దేశించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. 240 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం, సరఫరా చేయడం ద్వారా.. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సంగారెడ్డి, నిజమాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మెడ్చల్, పెద్దపల్లి జిల్లాల్లోని ప్రాంతాలకు కొత్తగా నీరు అందించి సాగునీటి పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనలు ఉన్నట్లు చెప్పారు.
ఇప్పటి వరకు రూ.59,535 కోట్లు విడుదల
2015-16 ధరల స్థాయిని అనుసరించి రూ.80,190.46 కోట్ల జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని సాగునీరు, వరద నియంత్రణ, బహుళార్ధకసాధక ప్రాజక్టుల సలహా సమితి ఖరారు చేసిందని, ఇప్పటి వరకు ఈ ప్రాజక్టు నిర్మాణం కోసం రూ.80,321.57 కోట్లు ఖర్చు చేశారని షెకావత్ వివరించారు. ప్రాజక్టులో చేపట్టిన అదనపు విభాగాల ప్రతిపాదనలు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించలేదన్నారు. ఆరు ఆర్థిక సంస్థలు ప్రాజక్టు కోసం.. రూ.86,064.01 కోట్లు మంజూరు చేసి.. ఇప్పటి వరకు రూ.59,535 కోట్లు విడుదల చేసినట్లు షెకావత్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

