Jairam Ramesh : ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ గడ్డపై దేశ మాజీ ప్రధానులను, ఆర్ధిక విధానాలను విమర్శిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. విపక్ష నేత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ దేశాన్ని విమర్శిస్తారని ప్రధాని మోదీ పదేపదే అసత్యాలు వల్లె వేస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ పూర్తిగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అన్ని దేశాలతో సరైన సంబంధాలను నెరపుతామని, ఆయా దేశాల నుంచి సాయం కూడా పొందామని గుర్తుచేశారు. విదేశాలకు వెళ్లినప్పుడు రాహుల్ గాంధీ మన దేశంపై విమర్శలు గుప్పిస్తారని మోదీ పచ్చి అబద్దాలు చెబుతున్నారని, కానీ విదేశీ పర్యటనల్లో మోదీ చేస్తున్నదేంటని జైరాం రమేష్ నిలదీశారు.
విదేశీ పర్యటనల్లో ప్రధాని మోదీ మన మాజీ ప్రధానులను, దేశ ఆర్ధిక విధానాలను విమర్శిస్తుంటారని దుయ్యబట్టారు. 2014లో మోదీ అమెరికా పర్యటనలో మన మాజీ ప్రధానిని విమర్శించారని జైరాం రమేష్ గుర్తుచేశారు. కాగా, బీజేపీకి దీటైన పోటీ ఇస్తున్న పార్టీ కావడంతోనే కాషాయ పాలకులు నిత్యం కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రాహుల్ గాంధీ ఒక్కరే బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారని అన్నారు.
Read More :
Harish Rao | లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న హరీశ్‌రావు.. రైతులకు రుణమాఫీ విముక్తి కోసం పూజలు