యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) దర్శించుకున్నారు. రైతులకు రుణమాఫీ విముక్తి కావాలని పూజలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయన యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట ఇచ్చి తప్పినందుకు పరిహార పూజలు చేశారు. రుణమాఫీ చేయడంతో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ‘స్వామీ.. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు.. తెలంగాణ ప్రజలపై దయ ఉంచు అని’ వేడుకున్నానన్నారు.
అనంతరం అక్కడి నుంచి ఆలేరు బయల్దేరారు. కోతల ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆలేరులో నిర్వహించనున్న ధర్నాలో ఆయన పాల్గొంటారు. హరీశ్‌రావు వెంట ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు గొంగడి సునీత, బూడిద బిక్షమయ్య తదితరులు ఉన్నారు.
Harish