న్యూఢిల్లీ : ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసింది. జగ్దీప్ ధన్కర్ను బరిలోకి దింపింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పని చేస్తున్నారు. శనివారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పార్లమెంటరీ బోర్డు సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్డీయే తరఫున జగ్దీప్ ధన్కర్ను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్ట్ 10న ముగియనున్నది. ఈ క్రమంలో ఇటీవల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్ట్ 6న ఓటింగ్ జరుగనున్నది.